సంగీత దర్శకుడిగా తమన్ “అరవింద సమేత” చిత్రంతో 100 సినిమాల మార్క్ దాటాడు. ఈ విషయం మొన్నామధ్య తమన్ తన ట్విట్టర్ ద్వారా చెప్పేవారకు ఎవరికీ తెలియలేదు. తెలియగానే అందరూ కాంగ్రాట్స్ చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ.. తమన్ చెప్పిన 100 సినిమాల లెక్కలో చిన్న బొక్క ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. “అరవింద సమేత” సూపర్ హిట్ అయ్యింది కాబట్టి తన మైల్ స్టోన్ ఫిలిమ్ గా ఆ చిత్రాన్ని చరిత్రలోకి ఎక్కించడం కోసం తమన్ తప్పుడు లెక్కలతో “అరవింద సమేత”ను వందో సినిమాగా ప్రకటించుకున్నాడు కానీ.. నిజంగా అది అతడి వందో సినిమా కాదని అభిప్రాయాలూ, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
మరి వాళ్ళందరూ అనుకొంటున్నట్లు తమన్ నిజంగానే “అరవింద సమేత”ను తన వందో సినిమాగా చెప్పుకోవడం కోసం కౌంట్ తప్పు వేశాడా లేక నిజంగానే రిలీజ్ కి ముందు ఆ విషయాన్ని మర్చిపోయి.. మొన్న ఎనౌన్స్ చేశాడా అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ… ఏదేమైనా పదేళ్ళ కాలంలో నిర్విరామంగా 100 సినిమాలు, అంటే ఏడాదికి పది సినిమాలు చేసుకుంటూ వచ్చిన తమన్ ని మెచ్చుకోకుండా ఉండలేమ్. కానీ.. ఇలా నెంబర్ గేమ్ కోసం తాపత్రయపడి వచ్చిన మంచి పేరును పోగొట్టుకోవడం మాత్రం బాధాకరమే.