బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వవైభవం వస్తుందా?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ ఇండస్ట్రీ నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. బాహుబలి ది బిగినింగ్ నుంచి కేజీఎఫ్2 సినిమా వరకు ఎన్నో సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టించాయి. పుష్ప ది రూల్, సలార్, ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ, ప్రాజెక్ట్ కే, చరణ్ శంకర్ కాంబో మూవీ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలతో కూడా బాలీవుడ్ కు భారీ షాక్ తప్పదని తెలుస్తోంది.

మరోవైపు హిందీలో పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నా ఆ సినిమాల కలెక్షన్లు ఆశాజనకంగా లేవు. పెద్దపెద్ద బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో కలెక్షన్ల విషయంలో షాక్ తగులుతుండటం అభిమానులను ఒకింత బాధిస్తోంది. బాలీవుడ్ హీరోలు మళ్లీ మంచి కథలలో నటించి సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో డబ్ అయ్యి యుట్యూబ్ లో సంచలనాలు సృష్టించాయి.

ఇప్పుడు థియేటర్లలోనే సత్తా చాటుతున్నాయి. సౌత్ సినిమాల హిందీ థియేట్రికల్ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేయడానికి హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. పుష్ప ది రూల్ కు హిందీ నుంచి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలకు సైతం హిందీలో మంచి డిమాండ్ నెలకొంది. బాలీవుడ్ మేకర్స్ కథ,

కథనంపై దృష్టి పెట్టని పక్షంలో మరికొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. సౌత్ సినిమాలలో చాలా సినిమాలు భారీ బడ్జెట్లతో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. నిర్మాతలు రాజీ పడకుండా సినిమాలను నిర్మించడం వల్లే సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.