సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కథలను ఎన్నుకుంటూ సినిమాలు తీస్తుంటాడు. అతడు తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా రిలీజ్ సమయంలో వర్మపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల, వర్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. వర్మ తనదైన స్టైల్ లో జొన్నవిత్తులపై సెటైర్లు వేయడంతో అతడు వర్మ బయోపిక్ తీస్తానంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు.
‘ఆర్జీవీ’ అనే టైటిల్ తో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ఒక సైకో బయోపిక్ అనే ట్యాగ్ లైన్ కూడా అనుకున్నారు. అయితే సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్ ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ టైటిల్ పెట్టాలంటే ఆర్జీవీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఎన్నో వివాదాస్పద టైటిల్ పెట్టినా అభ్యంతరం చెప్పని ఛాంబర్ నిర్వాహకులు తమకు మాత్రం షరతులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఛాంబర్ ఇవ్వకుంటే వేరే ఛాంబర్ లో తెచ్చుకుంటామని కానీ తమకి టైటిల్ ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారో రాతపూర్వకంగా తెలియజేయాలని అంటున్నారు.