Bheems Ceciroleo: ఏంటి భీమ్స్ ఇది.. ఏడాది కూడా కాలేదు, అప్పుడే కాపీనా?

ఒకప్పటిలా కాదు..ఇప్పుడు..! రాబోయే సినిమాలకి సంబంధించి ఏదైనా కాపీగా అనిపిస్తే, వెంటనే ట్రోలర్స్, మీమర్స్ అలర్ట్ అయిపోతున్నారు. నేషనల్ లెవెల్లో దాన్ని ట్రెండ్ చేసి వార్తల్లో నింపుతున్నారు. ముఖ్యంగా పాటల విషయంలో అయితే ఏ టూల్స్ వాడుతున్నారో తెలీదు కానీ.. నిమిషాల్లోనే కాపీ ట్యూన్ ని పసిగట్టేస్తున్నారు. ఒరిజినల్…ని బయటపెడుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) విషయంలో ఇలాంటివి చాలానే చూశాం. ఇటీవల ‘దేవర’ (Devara) పాటల విషయంలో అనిరుధ్ (Anirudh Ravichander)…ని కూడా ఏకిపారేశారు. ఇప్పుడు భీమ్స్ వంతు వచ్చినట్టు ఉంది.

Bheems Ceciroleo

వివరాల్లోకి వెళితే.. గతేడాది చివర్లో వచ్చిన ‘మ్యాడ్’ (MAD) సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందుతుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మ్యాడ్’ హిట్ అవ్వడంతో దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో మొదటి నుండి సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

ఈ క్రమంలో ‘లడ్డు గాని పెళ్లి’ అనే లిరికల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఈ ప్రోమోకి సంబంధించిన ట్యూన్.. గతంలో విన్నట్లే ఉంది. కొంచెం డీప్..గా అబ్జర్వ్ చేస్తే, గత ఏడాది వచ్చిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమాలోని ‘లచ్చి గాని పెళ్లి’ ట్యూన్..నే ‘లడ్డు గాని పెళ్లి’కి కూడా వాడేసినట్టు స్పష్టమవుతుంది. రెండు సినిమాలకు భీమ్స్ (Bheems Ceciroleo) సంగీత దర్శకుడు కాబట్టి.. ఈ ట్యూన్స్ చాలా అంటే చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకసారి వీటిని లుక్కేయండి :

యాక్షన్ సినిమా రిలీజ్ కి ఆ డేట్ ను ఎలా డిసైడ్ అయ్యారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus