The Greatest of All Time: ది గోట్ మూవీ విమర్శలపై వెంకట్ ప్రభు స్పందిస్తారా?
- September 7, 2024 / 12:00 PM ISTByFilmy Focus
విజయ్ (Thalapathy Vijay) వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్ లో తెరకెక్కిన ది గోట్ (The Greatest of All Time) సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విజయ్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వెంకట్ ప్రభు సద్వినియోగం చేసుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ది గోట్ మూవీ రిజల్ట్ విషయంలో విజయ్ అభిమానులు సైతం సంతోషంగా లేరు. కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేస్తోంది.
The Greatest of All Time

అయితే ఈ సినిమా కాపీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. 30 సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైన విజయ్ కాంత్ రాజదురై మూవీ నుంచి ఈ సినిమాలోని మెయిన్ సన్నివేశాలను కాపీ చేసి ది గోట్ సినిమా తీశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో వస్తున్న విమర్శల గురించి వెంకట్ ప్రభు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ది గోట్ (The Greatest of All Time) సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

విజయ్ తర్వాత సినిమా అయినా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ రెమ్యునరేషన్ 220 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా విజయ్ సినిమాలు భారీ రేంజ్ లో హిట్టైతే మాత్రమే నిర్మాతకు లాభాలు వస్తాయి. పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే కథలకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
![]()
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కానున్న నేపథ్యంలో రాజకీయాల్లో సైతం విజయ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ చివరి సినిమా ఎలాంటి కథాంశంతో తెరకెక్కుతోందనే చర్చ జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమిళంలో మాత్రం ది గోట్ (The Greatest of All Time) మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో వెంకట్ ప్రభు ఫెయిల్ అవుతున్నారు.















