ఈమధ్యకాలంలో భీభత్సమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ సినిమాకి వచ్చాయి అంటే ఏమాత్రం సినిమా నాలెడ్జ్ తోపాటు ఇండస్ట్రీ అప్డేట్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం “గీత గోవిందం”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు కోర్ట్ కేస్ పడింది.
కారణం ఏంట్రా అంటే.. ఇటీవల విడుదల చేసిన “గీత గోవిందం” టీజర్ లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ “గోవింద్ ఏజ్:25, స్టిల్ వర్జిన్” అని పేర్కొన్నారు. దాంతో ఆ క్యారెక్టర్ రాసింది నేను అంటూ ఓ యువ రచయిత ఫిలిమ్ ఛాంబర్ ను ఆశ్రయించి ఏకంగా నోటీసులు పంపాడట. దాంతో టెన్షన్ లో పడ్డారు సినిమా యూనిట్. అయితే.. వెంటనే స్పందించిన పరశురామ్ “కేవలం విజయ్ దేవరకొండ ప్రీవీయస్ మూవీ “అర్జున్ రెడ్డి”ని బేస్ చేసుకొని జనాలకి ఎక్కువగా రీచ్ అవుతుందని మాత్రమే అలా పోస్టర్ డిజైన్ చేశాను తప్ప.. ఆ పాత్రకి వర్జిన్ క్యారెక్టరైజేషన్ లో అస్సలు సంబంధం లేదు” అని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా రంగం లోకి దిగడంతో.. ఈ కేసు ఎక్కువ రోజులు నిలవలేదని స్పష్టం అయిపోయింది.