కరోనా దెబ్బకి కుదేలవుతున్న చిత్ర పరిశ్రమలు..!

  • March 9, 2020 / 05:54 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా లేదు. చైనాలో మొదలైన ఈ వైరస్ వేగంగా ఖండాతరాలు దాటిపోతుంది. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ వైరస్ బారినపడ్డాయి. ఇప్పటికే ఈ కొత్త వైరస్ కారణంగా వేలల్లో మరణించినట్లు అధికారికంగా తెలుస్తుంది. దేశాల మధ్య రాకపోకలు, ఎగుమతులు దిగుమతులతో పాటు అనేక వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాపిటల్ మర్కెట్స్ భారీగా నష్టపోతున్నాయి. ఇక సినిమా పరిశ్రమపై కూడా కరోనా ప్రభావం దారుణంగా ఉంది.

ఇప్పటికే విడుదలైన సినిమాలు కలెక్షన్స్ లేక విలవిలలాడుతున్నాయి. ఈ వైరస్ కి భయపడిన ప్రేక్షకులు థియేటర్స్ వైపు వెళ్లడం లేదు. అధిక జనసంచారం ఉండే ప్రాంతాలకు వెళ్లకూడని నిర్ణయించుకుంటున్నారు. ఈ పరిస్థితులలో కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. ఈ వైరస్ ప్రభావం తగ్గేవరకు సినిమా విడుదల చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చారు. బాండ్ సిరీస్ లో వస్తున్న నో టైం టు డై మూవీ ఏకంగా ఏడు నెలకు వాయిదా వేశారు. ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ కి పోస్ట్ ఫోన్ చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలోని సినిమాల విడుదల కోవిడ్-19 కారణంగా వాయిదాపడ్డాయి. దీనితో నిర్మాతలకు వడ్డీలు పెరిగి నష్టాలు సంభవించే పరిస్థితి ఏర్పడింది.

ఇక అనేక చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రభాస్ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియా లో జరగాల్సివుండగా హైదరాబాద్ లో సెట్స్ తో మేనేజ్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కరణ్ జోహాన్ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర, థక్త్ చిత్రాల షూటింగ్ ఆగిపోయింది. ఇలా భారత్ లోని అనేక చిత్ర పరిశ్రమల విదేశీ షెడ్యూల్స్ ఆగిపోవడం జరిగింది. ఇంకా అనేక విధాలుగా కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఏదో విధంగా దీనికి పరిష్కారం కనుగొనకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus