వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న బిజీ ఆర్టిస్టుల్లో ఒకరు. తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాల్లో నటించిన వరలక్ష్మీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చి.. నెగిటివ్ రోల్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా అక్కడ వరలక్ష్మీ దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు.
అయితే తెలుగులో చేసిన ‘క్రాక్’ ‘వీరసింహారెడ్డి’ ‘హనుమాన్’ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. వరలక్ష్మీ పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులోనే ఈమెకు ఎక్కువ ఆఫర్లు వస్తుండటంతో ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇక ఈమె వ్యక్తిగత జీవితం కూడా అందరికీ సుపరిచితమే. గతేడాది ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ ను ఈమె పెళ్లాడింది. అతని పేరు నికోలాయ్ సచ్ దేవ్.
వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ దంపతులు పెళ్లి చేసుకుని ఏడాది కావస్తోంది. గత ఏడాది జూలైలో వీరి వివాహం జరిగింది. తమ మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ గా నికోలాయ్ సచ్ దేవ్ .. తన భార్య వరలక్ష్మీకి ఓ కారును బహూకరించి సర్ప్రైజ్ చేశాడు. చెన్నైలో ఉన్న వరలక్ష్మీకి పోర్సె 718 బాక్స్ టర్ మోడల్ కారును పంపగా ఆమె సర్ప్రైజ్ అయ్యింది. ఆ తర్వాత ఆ కారులో కాసేపు షికార్లు కొట్టింది. దీని ధర రూ.1.6 కోట్లు అని తెలుస్తుంది.తన భర్త పంపిన కారులో షికారు కొడుతున్న వరలక్ష్మీ కొన్ని ఫోటోలు తీసుకుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. గులాబీ రంగులో ఉన్న ఈ కారు చూడటానికి చాలా అందంగా ఉంది. దీంతో ఈమె ఫాలోవర్స్ ‘కంగ్రాట్స్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.