Hero Nani: నాని కోసం విలేజ్ సెట్.. ఎంత ఖర్చు పెట్టారంటే..?

గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో నాని ఇమేజ్ మరింత పెరిగింది. ఇటీవల ఆయన నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓదెల శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మొన్నామధ్య సినిమా ఫస్ట్ లుక్ ను వదిలారు. అందులో నాని రగ్డ్ లుక్ తో ఆకట్టుకున్నారు.

సింగరేణి కోల్ మైన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాతో మంచి మెసేజ్ చెప్పబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఓ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నారట. దీనికోసం రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. క్క సెట్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారంటే మాములు విషయం కాదు. నిజానికి నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది.

అలాంటి ఈ ఒక్క సినిమా సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు చేస్తున్నారంటే.. సినిమాను ఏ రేంజ్ లో తీస్తున్నారో..? అయితే ఎక్కువ భాగం షూటింగ్ మాత్రం ఈ సెట్ లోనే ఉంటుందట. ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి పలురకాల చెట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. అలానే మలయాళ నటుడు రోషన్ మాత్యు కీలకపాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus