కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గాయి. అలానే ఇతర కారణాల వలన కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన చిక్కుల్లో పడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దానిని లెక్కల్లో చూపించలేదని గుర్తించారు.
అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహనటుడు సింగముత్తు తనను మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాదు.. సింగముత్తుపై ఆయన క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటినుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. గతంలో ఈ కేసు విచారణలకు కోర్టుకు రావాలని వడివేలుకి కోర్టు సమన్లు పంపించింది కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
గురువారం నాడు ఈ కేసు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలో సింగముత్తు తరఫు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలునే విక్రయించారు అని వాళ్లు కోర్టుకు తెలిపారు. పన్ను ఎగ్గొట్టడానికే వడివేలు.. సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వాదనలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కి వాయిదా వేశారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!