మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా చేస్తున్న ఖైదీ నంబర్ 150 మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ ఫిల్మ్ ఆడియో వేడుకను విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించాలని నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనుకున్నారు. అక్కడ ఈ ఫంక్షన్ జరపకూడదని స్పోర్ట్స్ అసోసియేషన్ల వారు అడ్డుపడుతున్నారు. యాభైయేళ్ల క్రితం నిర్మితమైన ఈ స్టేడియంలో 1974 నుండి సినిమా వేడుకలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల వల్ల మైదానం దెబ్బ తింటుందని కొందరు రెండేళ్లక్రితం కోర్టుని ఆశ్రయించారు.
2015 లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఈ మునిసిపల్ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కోసమే వాడాలని తీర్పు ఇచ్చింది. అందుకు మినహాయింపుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మాత్రం.. ఎవరన్నా ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లే ఛాన్సు కూడా ఉందని స్పష్టం చేసింది. అందుకే చిరు సినిమా ఆడియో వేడుకకు జిల్లా కలక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వలేరు. దీంతో చిత్ర బృందం ఆలోచనలో పడింది. సీఎం చంద్ర బాబు నాయుడు నుంచి అనుమతి తీసుకొని ఫంక్షన్ నిర్వహించాలా? వేరే వేదికను ఎంపిక చేసుకోవాలా ? అనే విషయంలో మెగా కుటుంబ సభ్యులు ఈరోజు చర్చిస్తున్నారు. రెండు రోజుల్లో వేదిక విషయంలో క్లారిటీ రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.