Ram Charan: రామ్ చరణ్ షర్టు పై క్రేజీ మీమ్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా ప్రస్తుతం సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గురించి తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.. సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి వేసుకున్నటువంటి దుస్తులను మరోసారి వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.

సెలబ్రిటీలు ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తున్న లేదా ఒక అవార్డు కార్యక్రమాలకు వెళ్తున్న ప్రత్యేకంగా డ్రెస్సులను డిజైన్ చేయించుకొని మరి వెళ్తూ ఉంటారు. ఎవరు కూడా వేసిన డ్రెస్ లను మరోసారి వేయరు కానీ రామ్ చరణ్ మాత్రం ఒక షర్ట్ ను కొన్ని సంవత్సరాలుగా తరచూ వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2016 వ సంవత్సరం నుంచి ఈయన ఇప్పటివరకు పలు సందర్భాలలో వేసుకొని ఉన్నటువంటి ఫోటోలను కలెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇలా రామ్ చరణ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ షర్ట్ భద్రంగా దాచుకొని మరి వేసుకుంటున్నారు అంటే ఆ షర్ట్ ఎంతో స్పెషల్ అయి ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏంటన్నా ఉపాసన వదిన ఇచ్చిన ఫస్ట్ గిఫ్టా ఇది అంత భద్రంగా దాచుకున్నావు అంటూ కొంతమందికి ఈ షర్ట్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.

చాలా వాల్యుబుల్ పర్సన్ ఇచ్చిన గిఫ్ట్ అయ్యి ఉంటుందని అందుకే ఇలా చాలా సంవత్సరాల నుంచి దాచుకొని మరి వేసుకుంటున్నారు అంటూ రాంచరణ్ షర్టు గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఎంతో గొప్ప నటుడు ఇలా ఒక షర్ట్ ఇన్ని సంవత్సరాలు పాటు వేసుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. రామ్ చరణ్ కొన్ని కోట్లకు వారసుడు అయినప్పటికీ ఈయన ఎంతో ఒదిగే ఉంటారని అందరికీ తెలిసిందే అందుకు నిదర్శనం ఇది కూడా అని చెప్పవచ్చు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus