Chiranjeevi: చిరు జగన్ మీటింగ్.. మరో షాకింగ్ రూమర్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఇండస్ట్రీ తరపున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ కలయికపై ఎవరు ఊహించని విధంగా ఒక గాసిప్ వైరల్ గా మారింది. వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై మెగాస్టార్‌ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నట్లు టాక్ వస్తోంది. దీనికి బలమైన కారణాలు లేకపోలేవు. సినిమా ఇండస్ట్రీ స్టాండ్‌ఆఫ్ ప్రధాన ఎజెండా కాదని మొదటి నుంచీ స్పష్టమైంది. తాను జగన్‌ని కలుస్తున్నది ఇండస్ట్రీ పెద్దాగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డాగా అని స్వయంగా చిరు చెప్పారు.

అయితే చిరుని రాజ్యసభకు పంపితే పవన్ కళ్యాణ్-చంద్రబాబు ప్రణాళికపై ప్రభావితం చూపిస్తుంది. అందుకే జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ వర్గం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని RGV కలిసిన కొన్ని రోజుల తర్వాత చిరు జగన్ ను కలవడం ఆసక్తికరంగా ఉంది. ఈ భేటీలో ఏం జరిగిందనేది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. ఇక, వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు అయిన మోహన్ బాబుని జగన్ తదుపరి ఆహ్వానించవచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు MAA అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో చీలికలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున , మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు సేఫ్ గేమ్ ఆడుతున్నారనేది అందరికి తెలిసిందే. వారు వివాదాలకు తవువ్వకుండా సేఫ్ గా మాట్లాడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ పదవి ఆఫర్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ లో చీలికలు వస్తాయని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ రాజకీయాలకు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కొన్నాళ్ళు కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆయన కొన్నాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇక వైసీపీ ఆఫర్ కు మెగాస్టార్ ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఆంద్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంటుంది అని చెప్పవచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus