Adipurush: ప్రభాస్ అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించే అప్డేట్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) కూడా ఒకటి. బాలీవుడ్లో తానాజీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘టి సిరీస్’ సంస్థ ఈ చిత్రాన్ని రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. నిజానికి ఈ ఏడాది అంటే 2023 జనవరి 11 నే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఏడాది కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అప్డేట్ లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఈ చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. వి.ఎఫ్.ఎక్స్ ఇంకా బెటర్ గా రావాలనే ఉద్దేశంతో సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టు బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. గతేడాది అక్టోబర్ 2న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. దానికి మిశ్రమ స్పందన లభించింది. ‘కార్టూన్ సినిమాను తలపించేలా ‘ఆదిపురుష్’ టీజర్ ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ బాగా నాసిరకంగా ఉన్నాయని’ అంతా పెదవి విరిచారు. అందుకోసమే అదనంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చేయించుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.

ఇదిలా ఉండగా.. మార్చ్ 30న శ్రీరామనవమి పండుగ సందర్భంగా ‘ఆదిపురుష్’ నుండి ఓ సూపర్ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో అంటే రాఘవ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సీత అలియాస్ జానకి పాత్రలో కృతి సనన్ కనిపించబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus