మరోసారి చిక్కుల్లో పడ్డ సురేష్ బాబు, రానా

దగ్గుబాటి సురేష్ బాబు .. అలాగే ఆయన పెద్ద కొడుకు దగ్గుబాటి రానా పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. కొంతకాలంగా ఓ స్థలం గొడవలో చిక్కుకుని ఈ తండ్రీ కొడుకులు అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లో దగ్గుబాటి సురేష్ బాబు, రానా పేర్ల పై కొంత ఖాళీ స్థలం ఉంది. దాన్ని ఓ వ్యాపార వేత్తకు చాలా కాలం క్రితం లీజుకు కూడా ఇచ్చారు.

అయితే గడువు తీరకుండానే ఆ వ్యాపారవేత్తని.. ఖాళీ చేసి మా స్థలం మాకు ఇచ్చేయమని కోరారు.కానీ గడువు ఇంకా పూర్తవ్వకుండా.. ఎలా ఖాళీ చేస్తాను అని అతను ఎదురు తిరిగాడు. ఈ క్రమంలో రౌడీల సాయంతో తనను ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే బిజినెస్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకోసారి ఆ స్థలం జోలికి నీ అంతు చూస్తామని సురేష్ బాబు.. వార్నింగ్ కూడా ఇచ్చారని అతను తెలియజేశాడు.

ఈ విషయం పై బంజారా హిల్స్ పోలీసులు కూడా అతనికి సాయం చేయలేదని.. . ప్రమోద కోర్టుకెక్కాడు. సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో పాటు మరికొందరిపై నాంపల్లి కోర్టు కేసు పెట్టాడు. ఈ విషయం పై రానా ని కోర్టులో హాజరు కావాలని నోటీసులు వెళ్ళినా అతను కోర్టుకు హాజరు కాలేదు అని తెలుస్తుంది. పైగా ఆ స్థలం కూడా అతని పేరుపైనే ఉంది. కోర్టు నోటీసులు లెక్కచేయకపోవడం వల్లనే వారి పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus