నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన కస్టడీ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. చైతన్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనివాస్ చిట్టూరి షాకింగ్ విషయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. వెంకట్ ప్రభు ఆలోచించే విధానం నాకు ఇష్టమని కస్టడీ సినిమా చూస్తే తెలుగు ఎమోషన్స్ తో హాలీవుడ్ మూవీ చూసిన భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కస్టడీ సినిమా కోసం తెలుగుకు ప్రత్యేకమైన షాట్, తమిళానికి ప్రత్యేకమైన షాట్ తీశామని ఆయన తెలిపారు. తెలుగులో వెన్నెల కిషోర్ పోషించిన పాత్రను తమిళంలో ప్రేమ్ జీ చేశారని శ్రీనివాస్ చిట్టూరి కామెంట్లు చేశారు. 1990 బ్యాక్ డ్రాప్ లో కస్టడీ సినిమా ఉంటుందని చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిందని ఆయన తెలిపారు. కస్టడీ మూవీలో ప్రతి రోల్ యూనిక్ గా ఉంటుందని శ్రీనివాస్ చిట్టూరి చెప్పుకొచ్చారు.
అరవింద్ స్వామి రోల్ టెర్రిఫిక్ గా, ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని (Srinivasaa Chitturi) శ్రీనివాస్ చిట్టూరి కామెంట్లు చేశారు. అరవింద్ స్వామి, శరత్ కుమార్ పాత్రల మధ్య రెండు కొండల మధ్యలో చిట్టెలుకలా నాగచైతన్య రోల్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ప్రియమణి సీఎం రోల్ లో కనిపిస్తారని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని శ్రీనివాస్ చిట్టూరి పేర్కొన్నారు.
ఈ సినిమాలోని అండర్ వాటర్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు. మైసూర్, రాజమండ్రి ప్రాంతాల్లో ఆ సీన్ షూట్ జరిగిందని శ్రీనివాస్ చిట్టూరి పేర్కొన్నారు. శ్రీనివాస్ చిట్టూరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.