Abhiram Wedding: ఘనంగా దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష పెళ్లి..వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫోటోలు!

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, హీరో రానాకి తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ కి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అభిరామ్ ‘అహింస’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ‘ఆనంది ఆర్ట్స్’ సంస్థ నిర్మించింది. జూన్ 2 న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. దీంతో రెండో సినిమా కోసం అభిరామ్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. వరుసగా కథలు వింటున్నట్టు కూడా తెలుస్తుంది.

ఇది పక్కన పెట్టేస్తే.. నిన్న రాత్రి అంటే డిసెంబర్ 6 న శ్రీలంకలోని ఓ ఫంక్షన్ హాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అభిరామ్ పెళ్లి జరిగింది. అతి తక్కువ మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది అని చెప్పొచ్చు. అభిరామ్ భార్య పేరు ప్రత్యూష. ఈమె సురేష్ బాబు కుటుంబానికి దూరపు బంధువు అని తెలుస్తుంది. అభిరామ్ – ప్రత్యూష బావమరదళ్ళు. వీరి జోడి కూడా చూడముచ్చటగా ఉంది.

ఇక 3 రోజుల పాటు (Abhiram) అభిరామ్ – ప్రత్యూష..ల పెళ్లి సంబరాలు జరిగినట్లు. హల్దీ వేడుకలు, సంగీత్ వంటి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు.హైదరాబాద్ లో కూడా ఓ రిసెప్షన్ ను ఏర్పాటు చేయాలని సురేష్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది పక్కన పెట్టేసి.. అభిరామ్ – ప్రత్యూష.. ల వెడ్డింగ్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus