కొంతకాలంగా సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.2023 లో శరత్ బాబు,కె.విశ్వనాథ్, చంద్రమోహన్, విజయ్ కాంత్ వంటి దిగ్గజాలు మరణించారు. ఈ ఏడాది ఇప్పటికే ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి మరణించడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై సామి కూడా మరణించారు. ఈ మధ్యనే సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్ కూడా మరణించడం జరిగింది.
ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో నటి కన్నుమూయడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. హిందీ చిత్ర సీమలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్ మరణించడం హిందీ చిత్ర సీమని విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ‘దంగల్’ సినిమాలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
హీరోకి రెండో కూతురుగా, ఐబిత కుమారి ఫోగట్ అనే పాత్రలో కనిపించి మంచి నటన కనపరిచింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ‘బల్లే ట్రూప్’ అనే ఇంకో సినిమాలో కూడా నటించింది. అయితే అటు తర్వాత ఈమె నటనకి దూరమయ్యింది. ఆ క్రమంలో చదువు పైనే ఫోకస్ పెట్టింది అని చెప్పాలి.
అయితే ఇటీవల ఈమె ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఈమె తీసుకున్న మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయట. దీంతో ఈమెను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. 19 ఏళ్ల చిన్న వయసులోనే (Suhani Bhatnagar) సుహానా ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం అనే చెప్పాలి.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!