Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » చూసి అనుభూతి చెందాల్సిన సినిమా ‘ఎ క్వైట్ ప్లేస్’.!

చూసి అనుభూతి చెందాల్సిన సినిమా ‘ఎ క్వైట్ ప్లేస్’.!

  • April 7, 2018 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చూసి అనుభూతి చెందాల్సిన సినిమా ‘ఎ క్వైట్ ప్లేస్’.!

సినిమాలో ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు, ఎలాంటి లొకేషన్ లో తీశారు అనే విషయాలు జనాలు పట్టించుకోవడం మానేశారు. సినిమా బాగుంటే చాలు ఆర్టిస్ట్ ఎవరు, ఏ భాషా చిత్రం అనేది ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈమధ్య కాన్సెప్ట్ చిత్రాల తాకిడి పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లోనే మాత్రమే కాదు హాలీవుడ్ లోనూ దర్శకనిర్మాతలు ఇప్పుడు కాన్సెప్ట్ సినిమాలవైపే మొగ్గుచూపుతున్నారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఎవెంజర్స్” లాంటి సినిమాలకు ఏస్థాయి క్రేజ్ ఉంటుందో.. 50 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన కాన్సెప్ట్ మూవీస్ కి కూడా అదే స్థాయి క్రేజ్ ఉంటుంది. అందుకు నిదర్శనం ఇటీవల విడుదలైన “డోంట్ బ్రీత్”, “లైట్స్ ఔట్” చిత్రాలే. చాలా తక్కువ బడ్జెట్ మరియు అయిదారుగురు పాత్రధారులతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చకి హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది.

ఇప్పుడు ఆ రెండు చిత్రాల కోవలో తెరకెక్కిన తాజా చిత్రం “ఎ క్వైట్ ప్లేస్” కూడా ఆ రెండు సినిమాలను మించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని గ్రహాంతరవాసుల ఒక గ్రామాన్ని ఆక్రమిస్తాయి. వాటికి కళ్ళు కనిపించవు. కేవలం శబ్ధాన్ని బట్టి మనుషుల మీద దాడి చేస్తాయి. ఊరంతా వల్లకాడైపోతుంది. చివరికి ఒకే ఒక్క కుటుంబం మాత్రం మిగులుతుంది. సైలెంట్ గా ఉండడం మాత్రమే అక్కడ ప్రాణాలతో బ్రతకడానికి ఏకైక మార్గం. అక్కడ్నుంచి బయటపడే మార్గం దొరక్క, ఆ గ్రహాంతర రాకాసులను చంపే దారి తెలియక సంవత్సరాలపాటు భయపడి అక్కడే బ్రతుకుతుంటారు. చివరికి వాళ్ళు ఆ రాకాసుల బారి నుంచి ఎలా తప్పించుకోగలిగారు? అనేది “ఎ క్వైట్ ప్లేస్” కథాంశం. సినిమా మొత్తానికి మనకి కేవలం ఒక రెండు అరుపులు మాత్రమే వినపడతాయి. మిగతాదంతా మూకీ సినిమాని తలపిస్తుంది. కానీ.. గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమా ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. అంత అద్భుతంగా నడిపించాడు దర్శకుడు చిత్రాన్ని. ఒక గర్భిణీస్త్రీ ప్రసవ వేదనను కూడా పంటిబిగువున భరిస్తూ తనకు పుట్టబోయే బిడ్డ ప్రాణాల కోసం పరితపించే సన్నివేశంలో ప్రతి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్ కి జారిపోతాడు. ప్రస్తుతం ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రమే కాదు ఇండియన్ బాక్సాఫీసును కూడా షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్నీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుండడం విశేషం. సో, డియర్ మూవీ లవర్స్ మీరందరూ తప్పకుండా చూసి ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Quiet Place
  • #Dark Comedy Concept Movies
  • #filmy focus
  • #Hollywood Movies
  • #Latest Horror Movies

Also Read

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

related news

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

56 mins ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

6 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

7 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

8 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

1 day ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version