Darling Collections: డిజాస్టర్ గా మిగిలిన ప్రియదర్శి ‘డార్లింగ్’.!
- August 22, 2024 / 09:44 AM ISTByFilmy Focus
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్ గా ‘డార్లింగ్’ (Darling) అనే సినిమా రూపొందింది. ‘హనుమాన్’ (Hanu Man) వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ అందించిన ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, అతని భార్య చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్విన్ రామ్ (Aswin Raam) ఈ చిత్రానికి దర్శకుడు. జూలై 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Darling Collections

పైగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్ ను వాడుకోవడంతో ఈ సినిమా బాగా ప్రమోట్ అయ్యింది.కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి (Darling Collections) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.67 cr |
| సీడెడ్ | 0.18 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.49 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.34 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.18 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 1.52 cr |
‘డార్లింగ్’ చిత్రానికి రూ.5.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.52 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.3.98 కోట్ల(షేర్) దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం.












