Harish Shankar: ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్
- August 19, 2024 / 09:20 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ (Jr NTR) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్.. అనగానే అందరికీ ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) గుర్తొస్తుంది. ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) తర్వాత హరీష్ శంకర్, ‘బాద్ షా’ (Baadshah) తర్వాత ఎన్టీఆర్..ల కలయికలో రూపొందిన సినిమా ఇది. పైగా దిల్ రాజు (Dil Raju) నిర్మాత. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే ‘స్కై ఈజ్ ది లిమిట్’ అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడతాయి. కానీ వాటిని ‘రామయ్యా వస్తావయ్యా’ మ్యాచ్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ ఫీలింగ్స్ కలిగించినా…అతి కీలకమైన సెకండాఫ్..బ్యాలెన్స్ తప్పడంతో.. ఎన్టీఆర్, హరీష్..ల కెరీర్లో డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది.
Harish Shankar

ఈ సినిమా ‘ప్లాప్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి’ అని ఓ సందర్భంలో దిల్ రాజు తెలియజేశారు. ‘ప్రభాస్ (Prabhas) ‘రెబల్’ (Rebel) సినిమా రావడం వల్ల.. ‘ ‘రామయ్యా వస్తావయ్యా’ కథకి సిమిలారిటీస్ ఉన్నాయని గ్రహించి చాలా మార్పులు చేశామని.. అందువల్ల కనెక్టివిటీ కూడా లోపించిందని, ముందుగా అనుకున్న కథతో ‘రామయ్య వస్తావయ్యా’ తీసుంటే సినిమా మంచి విజయం సాధించేది..’ అంటూ దిల్ రాజు చెప్పడం జరిగింది.

ఏదేమైనా ‘దర్శకుడు హరీష్ ఎనర్జీకి ఎన్టీఆర్ పర్ఫెక్ట్ హీరో’ అని అభిమానులు ఇప్పటికీ నమ్ముతుంటారు. అందుకే ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నారు. అయితే అది ఇప్పట్లో వర్కౌట్ అవ్వడం కష్టం. ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘ఎన్టీఆర్ తో సినిమా చేయాలని నాకు ఉంది. ఓ పాయింట్ కూడా అనుకున్నాను. కానీ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఎలా బిజీగా ఉన్నారో, ఎన్టీఆర్ కూడా అలాగే బిజీగా గడుపుతున్నారు. సో ఇప్పట్లో కష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్.

హరీష్ శంకర్.. రియాలిటీలోనే ఉన్నాడు. నిజంగానే ఇప్పుడు ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ‘దేవర..’ (Devara) రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. మరోపక్క ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే హిందీలో ‘వార్ 2’ కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. సో ఇంకో 2,3 ఏళ్ల వరకు ఎన్టీఆర్ డేట్స్ దొరకడం ఏ డైరెక్టర్..కి అయినా కష్టమే..!
యశ్ ‘స్పై’ యూనివర్స్‌లోకి అమ్మాయిలు.. ఎలా కనెక్ట్ చేస్తున్నారంటే?
NTR tho cinema.. ippatlo kashtame : Harish Shankar#HarishShankar #MrBachchan #NTR @tarak9999 #RamayyaVastavayya pic.twitter.com/cPrVoIsCqb
— Phani Kumar (@phanikumar2809) August 19, 2024
















