Das Ka Dhamki Collections: విశ్వక్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది..!

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా ‘పాగల్’ తర్వాత రూపొందిన మూవీ ‘దాస్ క ధమ్కీ’. ‘వన్మయే క్రియేషన్స్’ ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు, విశ్వక్ సేన్ లు కలిసి ఈ చిత్రాన్ని రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిరియాల సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభించింది.

టీజర్, ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చ్ 22న ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. కానీ వీకెండ్ ముగిశాక ఈ మూవీ పెద్దగా కలెక్ట్ చేసింది ఏమీ లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 3.26 cr
సీడెడ్ 1.05 cr
ఉత్తరాంధ్ర 0.92 cr
ఈస్ట్ 0.60 cr
వెస్ట్ 0.34 cr
గుంటూరు 0.57 cr
కృష్ణా 0.44 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 cr
ఓవర్సీస్ 1.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.66 cr (షేర్

‘దాస్ క ధమ్కీ’ చిత్రానికి రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10 కోట్ల షేర్ ను సాధించి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.1 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

రేపు నాని నటించిన ‘దసరా’ రిలీజ్ అవుతుంది కాబట్టి ‘దాస్ క ధమ్కీ'(Das Ka Dhamki) సినిమా ఇక క్యాష్ చేసుకునే అవకాశం లేదు. కానీ విశ్వక్ సేన్ కెరీర్లో ఇవి బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus