Srikanth Odela: దసరా డైరెక్టర్ కొత్త మూవీ మొదలుకాకపోవడానికి అసలు కారణమిదా?

నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ కాగా ఆయన డైరెక్షన్ స్కిల్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకోవడం ఖాయమని మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను తెరకెక్కించడం ఖాయమని అభిమానులు భావించారు. హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో శ్రీకాంత్ కు సులువుగా ఛాన్స్ దక్కడం లేదు.

అయితే దసరా సినిమా దర్శకుడు ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ లను మాత్రం ప్రకటించలేదు. తొలి సినిమాతోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఈ దర్శకుడు దసరా సినిమాతో నాని రేంజ్ ను మరింత పెంచారు. కొత్త ఆఫర్లు రాకపోవడంతో శ్రీకాంత్ ఓదెల రాబోయే రోజుల్లో నానితోనే మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ ఆలస్యం అవుతోందని సమాచారం అందుతోంది.

చాలామంది నిర్మాతలు శ్రీకాంత్ ఓదెలకు (Srikanth Odela) అడ్వాన్స్ లు ఇచ్చారని అయితే హీరోను సెట్ చేయడం మాత్రం సమస్యగా మారిందని తెలుస్తోంది. తనతో సినిమాలు తీసిన డైరెక్టర్లకు నాని కూడా వరుస అవకాశాలు ఇస్తుండటం గమనార్హం. శ్రీకాంత్ ఓదెల భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాని విషయానికి వస్తే ఈ హీరో హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నారు.

మరో 9 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హాయ్ నాన్న మూవీ ఎమోషనల్ మూవీగా తెరకెక్కగా మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో నిలుస్తుందో చూడాలి. నాని కన్నీళ్లు పెట్టిన ప్రతి సినిమా హిట్టేనని నాని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హాయ్ నాన్న కమర్షియల్ లెక్కల ప్రకారం సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus