Vishwambhara: విశ్వంభర త్యాగం వెనుక అసలు రీజన్ వేరు.. అసలేమైందంటే?

దసరా పండుగ కానుకగా విడుదలైన విశ్వంభర (Vishwambhara) టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. చిరంజీవి (Chiranjeevi)  సరైన సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో లక్ పరీక్షించుకోనున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta)  చిరంజీవి  ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ లోని గ్రాఫిక్స్ విషయంలో ట్రోల్స్ వస్తున్నాయి. మల్లిడి వశిష్ట టీజర్ కోసం ఎంతో కష్టపడినా గ్రాఫిక్స్ మరీ భారీ స్థాయిలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Vishwambhara

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లపై తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు సాధారణమని అంత మాత్రాన ఫైనల్ ఔట్ పుట్ లో గ్రాఫిక్స్ ఇదే విధంగా ఉండదని చెబుతున్నారు. విశ్వంభర (Vishwambhara) సినిమా రిలీజ్ కావడానికి మరో 7 నెలల సమయం ఉందనే సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ సమయానికి గ్రాఫిక్స్ విజువల్స్ కు సంబంధించి కొన్ని మార్పులు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు విశ్వంభర సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఓటీటీ డీల్ కు సంబంధించిన కొన్ని కారణాలు కూడా రిలీజ్ వాయిదాకు కారణమయ్యాయని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా షూట్ మాత్రం దాదాపుగా పూర్తైనట్టేనని చెప్పవచ్చు.

ఎప్పుడు విడుదలైనా విశ్వంభర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. విశ్వంభర చిరంజీవి కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను మే నెల 9వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. విశ్వంభర టీజర్ తమకు ఎంతగానో నచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

గోపీచంద్ ‘విశ్వం’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus