దసరా సినిమాల్లో పైచేయి సాధించే సినిమా అదేనా?

దసరా పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దసరా సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో బయ్యర్లు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే దసరా సినిమాలలో పై చేయి సాధించే సినిమా ఏదనే ప్రశ్నకు మాత్రం గాడ్ ఫాదర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగా ఈ సినిమా ఉండటం గమనార్హం. ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలకు సైతం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాలు కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండగా మరీ భారీగా లాభాలు మాత్రం వచ్చే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దసరా సినిమాలకు 130 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా మూడు సినిమాలు కనీసం 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తాయేమో చూడాలి. గాడ్ ఫాదర్ సినిమాకు టాక్ పాజిటివ్ గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే లూసిఫర్ సినిమాకు రీమేక్ కావడంతో ఇప్పటికే లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ఆసక్తి చూపించడం లేదు.

ది ఘోస్ట్ సినిమా బాగానే ఉన్నా మాస్ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ బెటర్ గా ఉండేది. స్వాతిముత్యం సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కగా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పోటీ పడటం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ సినిమా నిర్మాతలకు మాత్రం భారీ మొత్తంలో లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus