దాసరి పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినా కానీ అంతకంటే పెద్ద డిజాస్టర్ అయిన సినిమా ఏదంటే..?

దర్శకరత్న దాసరి నారాయణ రావు.. తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్.. వెర్సటైల్ యాక్టర్.. కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే రచయిత.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్.. ఇలా మరెవరికీ సాధ్యం కాని రీతిలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా చరిత్రలో నిలిచిపోయారు.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్, క్లాసిక్స్ ఎన్నో తీశారాయన.. 150 చిత్రాలు తెరకెక్కించిన దర్శక దిగ్గజం దాసరి శిష్యుడైన నటప్రపూర్ణ మోహన్ బాబు ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు.. మోహన్ బాబు స్టార్‌గా ఎదగడం వెనుక దాసరి పాత్ర కీలకం..

అలాంటి దాసరి కెరీర్‌లో కొన్ని అంచనాలను అందుకోలేని సినిమాలు కూడా ఉన్నాయి.. వాటిలో 2002లో వచ్చిన ‘కొండవీటి సింహాసనం’ ఒకటి.. ‘కొండవీటి సింహం’ తీసిన దాసరి నుండి ఇలాంటి చిత్రాన్ని ఎవరూ ఊహించలేదు.. ఆయనే కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాత.. సౌందర్య, లయ, దీప్తి భట్నాగర్, ఉదయ భాను, ‘బొమ్మాళి’ రవి శంకర్ వంటి భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్‌తో తీశారు.. కోటి సంగీత మందించారు..

ముందుగా ‘సర్దార్ నాగిరెడ్డి’ పేరు అనుకున్నారట.. వందేమాతరం శ్రీనివాస్ సంగత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాక.. అనివార్య కారణాల వల్ల ఆయన స్థానంలోకి కోటి వచ్చారు.. కానీ సినిమాలో పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ అస్సలు బాగోవు.. సాంకేతిక నిపుణులంతా కూడా సీనియర్లే కానీ.. దాసరికి ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయారేమో కానీ.. డిజాస్టర్ మూవీకి తలో చేయి వేసినట్టు అయ్యింది పరిస్థితి..దాసరి – మోహన్ బాబు రియల్ లైఫ్ మాదిరిగానే గురు శిష్యులుగా నటించారు..

99 ఏళ్ల వృద్ధుడి వేషం వరకు సినిమాలో మూడు గెటప్స్‌లో కనిపిస్తారు మోహన్ బాబు.. ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్, టెక్నీషియన్స్, హంగు, ఆర్భాటం ఉన్నా కానీ.. కథ లేకపోతే జనాలు పోస్టర్ వైపు కూడా కన్నెత్తి చూడరు అని నిరూపించిన ఈ చిత్రం కనీసం పోస్టర్లు అంటించడానికి వాడే మైదాపిండి ఖర్చులు కూడా రాబట్టలేదంటే ఎంతటి ఘోరాతిఘోరమైన పరాజయమో ఊహించుకోవచ్చు.. షూటింగ్ అప్పుడు ‘కొండవీటి సింహాసనం’ తన పరువు నిలబెడుతుందని దాసరి స్టేట్‌మెంట్ ఇవ్వడం హైలెట్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus