విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. విడుదల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన థాంక్స్ ప్రెస్‌మీట్‌లో…
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “నిన్న, ఈరోజు, రేపు థియేటర్స్ నింపిన అందరూ నా స్వీట్ కామ్రేడ్సే. నిన్న నాకెంతో ఇంపార్టెంట్ అయిన రోజు. నాకు స్పెషల్ మూవీ. పర్సనల్ మూవీ. ఏడాది పాటు నా ఎమోషన్స్ అన్ని ఇందులో పెట్టేసి చేశాను. ఈ సినిమా కంటెంట్‌ను, నా క్యారెక్టర్‌ను, బాబీ, లిల్లీ జర్నీ, డ్రీమ్స్, వారి ప్రేమ, రిలేషన్ షిప్స్, పడే కష్టాలు, కష్టాల దాటడానికి ఫైట్ చేసే జర్నీ నాకు ఎంతో పర్సనల్‌గా నిలిచింది. నేను ఎమోషనల్ పర్సన్ అయిపోయాను. మా తమ్ముడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఏడ్చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ ఊరికే ఏడుస్తున్నావెందుకు? నువ్వేంది ఇట్లా? అని అంటున్నారు. అందుకు కారణం డియర్ కామ్రేడ్. ఆ సినిమా నా ఎమోషనల్ సైడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేసింది. చాలా గర్వంగా ఉంది. నాకు కలెక్షన్స్ గురించి పెద్దగా తెలియవు. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. అంత మంది ప్రేక్షకులు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ప్రేక్షకులు నా సినిమాను చూశారనేదే నాకు ఇంపార్టెంట్. ఇంత రియాక్షన్, ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్స్. తొలిసారి నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం నా రెస్పాన్సిబిలిటీగా భావించాను. నేను చేయగలిగినంతా చేశాను. ఇంత మందికి సినిమా రీచ్ కావడాన్నిని కెరీర్‌లోనే ఫ్రౌడ్‌గా ఫీలవుతున్నాను. మొమరబుల్ జర్నీ. నా ఫేవరేట్ ఫిలిం. ఈ సినిమాను నా కామ్రేడ్స్‌కి, భరత్ వాళ్ల నాన్నగారికి డేడికేట్ చేస్తున్నామని చెప్పాను. భరత్ వాళ్ల నాన్నగారు కూడా ఇంత మందికి నచ్చేసినిమాను తీసిన నిన్ను చూసిన గర్వపడతాడు. నేషనల్ వైడ్ రివ్యూరైటర్స్ సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ రాశారు. చాలా మంది టచ్ చేశావంటూ మెసేజ్‌లు పెట్టారు. ట్వీట్స్ పెట్టారు. ఈ కథను ఇలానే చెప్పాలని అనుకున్నాం. బాబీ, లిల్లీ లైఫ్‌లో నాలుగేళ్ల జర్నీని చూపించే సినిమా ఇది. మన లైఫ్‌కు ఓ ఇబ్బంది వచ్చే వరకు అంతా బాగానే ఉంటుంది. సమస్య రాగానే, తర్వాత లైఫ్ టర్న్ అయ్యి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అదే మా సినిమా. ఫస్టాఫ్ వరకు బ్యూటీఫుల్‌గా ఉంటుంది. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. నా టీమ్‌ను చూసి గర్వపడుతున్నాను. జర్నీ ఆఫ్ డియర్ కామ్రేడ్‌ను విపరీతంగా మిస్ అవుతున్నాను. లిల్లీగా రష్మిక మందన్న అద్భుతంగా చేసింది. సినిమా స్లోగా ఉన్నా.. బ్యూటీఫుల్ ఫిలిం. పక్కా వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా అలా వెళ్లిపోతుంటుంది. మీరు తప్పకుండా సినిమాను ప్రేమిస్తారు. కాకినాడలో సక్సెస్ మీట్ పెడతానని ప్రీ రిలీజ్ రోజున ప్రామిస్ చేశాను. అక్కడే మాట్లాడుతాను“ అన్నారు.
డైరెక్టర్ భరత్ కమ్మ మాట్లాడుతూ – “`డియర్ కామ్రేడ్` హానెస్ట్ అటెంప్ట్. మేం ఏదైతే సినిమా ద్వారా చెప్పాలనుకున్నామో దాన్ని వందశాతం చూపించాం. సంధ్య థియేటర్‌కి వెళ్లినప్పుడు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ టైంలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి మా అందరికీ గూజ్‌బమ్స్ వచ్చాయి. అలాగే రెండు, మూడు థియేటర్స్‌కు వెళ్లాం. పెర్ఫామెన్స్ గురించి చెప్పాలంటే.. విజయ్ గురించి నేను స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తుంటారు. ఒక టైమ్‌లో రష్మిక చేసిన పెర్ఫామెన్స్, కామెడీ టైమింగ్‌తో .. లిల్లీ క్యారెక్టర్‌లో ఏడిపించేసింది. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థ్యాంక్స్. తమిల్, మలయాళం నుండి హ్యూజ్ రెస్పాన్స్. చాలా మంది బయటకు వచ్చి ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు“ అన్నారు.
నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ – “సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్“ అన్నారు.
మైత్రీ మూవీస్ సి.ఇ.ఒ చెర్రీ మాట్లాడుతూ – “సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక, భరత్‌గారికి కంగ్రాట్స్. సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో దాన్ని చక్కగా చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. యు.ఎస్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉంది. అక్కడ కూడా కలెక్షన్స్ బావున్నాయని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్‌కే కాదు.. ఎంటైర్ యూనిట్‌కు హ్యాపీ మూవీ. సినిమాకు సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్“ అన్నారు.
రష్మిక మందన్నా మాట్లాడుతూ – “ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నానని ముందు నుండే చెబుతున్నాను. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది మేం సినిమాకు బాగా కనెక్ట్ అయ్యామని చెబుతున్నారు. సినిమా కోసం అందరూ హార్డ్ వర్క్ చేయడం వల్లనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించాను. నాకు మాటలు రావడం లేదు. అందరినీ మిస్ అవుతాను“ అన్నారు.
యష్ రంగినేని మాట్లాడుతూ – “రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్. , యు.కె ల్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయని అందరూ మెసేజ్ పెడుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.