జూలై 11న `డియ‌ర్ కామ్రేడ్` ట్రైల‌ర్ విడుద‌ల

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` ట్యాగ్ లైన్‌`. భ‌ర‌త్ క‌మ్మ దర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జూలై 11న విడుద‌ల చేస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీత సారథ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు ఫెంటాస్టిక్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న విడుద‌ల‌వుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus