Deepika Padukone: కలల ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడిన దీపిక… ఏమందంటే?

కలల ప్రాజెక్టు… ఇది ప్రతి ఒక్క నటుడికి, నటికి, దర్శకుడికి, నిర్మాతకు కూడా ఉంటుంది. తమ కెరీర్‌లో అలాంటి సినిమా తీయాలని పక్కాగా లెక్క రాసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు సినిమా చేసి తమ ఆశ నెరవేర్చుకుంటూ ఉంటారు. అలా దీపిక పడుకొణెకి కూడా ఓ సినిమా ఉంది. అదే ‘ద్రౌపది’. చాలా కాలం క్రితమే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి ముచ్చట్లు వినిపించలేదు. దీంతో సినిమా ఆగిపోయిందేమో అని అనుకున్నారు. తాజాగా ఆ సినిమా మీద దీపిక స్పందించింది.

Click Here To Watch

‘గెహ్రహియా’ సినిమా ప్రచారంలో భాగంగా దీపిక ఇటీవల ఓ ఎంటర్‌టైన్మెంట్ వెబ్‌సైట్‌ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో నెటిజన్ల నుండి వచ్చిన ప్రశ్నలకు దీపిక సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ‘ద్రౌపది’ సినిమా గురించి అడిగారు. ‘ద్రౌపది’ సినిమా సంగతి చెప్పండి అని అడిగారు. దీనికి దీపిక స్పందిస్తూ… ‘కచ్చితంగా ఆ సినిమా చేస్తాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. దీంతో బాలీవుడ్‌లో మరో ఆసక్తికర సినిమా ఉన్నట్లే అని అభిమానులు ఖుష్‌ అవుతున్నాయి.

రామయాయణాన్ని ‘సీత’ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కంగనా రనౌత్‌ కథానాయికగా విజయేంద్ర ప్రసాద్‌ రచనలో ఈ సినిమా ఉంటుంది. అలాగే మహాభారతాన్ని ద్రౌపది పాయింట్ అఫ్ వ్యూలో చూపించే ప్రయత్నం దీపిక చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఇప్పటివరకు సినిమా పరిశ్రమలో ఎవరూ చేయలేదు అనే చెప్పాలి. రెండేళ్ల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు. అయితే ఇంకా ప్రీ ప్రొడక్షనే జరుగుతోందని దీపిక లేటెస్ట్‌ ఇన్ఫో ఇచ్చింది.

ప్రస్తుతం దీపిక ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తోంది. దీని తర్వాత హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ అనే సినిమా చేస్తుంది. దీంతోపాటు ఓ హాలీవుడ్‌ సినిమా చేయడానికి కూడా దీపిక అంగీకరించింది. రామ్‌ కామ్‌గా రూపొందనున్న ఈ సినిమా అదిరిపోతుందని టాక్‌.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus