విజయ్ సేతుపతి సౌత్ లో ఉన్న భాషల్లోనూ సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం అతను 15 సినిమాలకు పనిచేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అలాంటి విజయ్ సేతుపతి పై నవంబర్ 2న మైసూర్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ టైములో అతని పై చెయ్యి చేసుకున్నారని కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దాడి జరిగింది విజయ్ సేతుపతి పై కాదు అనే కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకోవడమే కాకుండా విజయ్ సేతుపతి పై రూ.3కోట్ల పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. నిజానికి ఆ రోజు చెన్నైకి చెందిన మహా గాంధీ అనే వ్యక్తిని..విజయ్ సేతుపతి మరియు అతని అసిస్టెంట్లు కొట్టినట్టు వార్తలు వచ్చాయి. విమానాశ్రయంలో నటుడు విజయ్ సేతుపతిని కలిసి అతని నటనను మెచ్చుకుంటూ మాట్లాడుతుంటే ఈ లోపు విజయ్ సిబ్బంది వచ్చి అతని పై దాడి చేసినట్టు అతను పిర్యాదు చేసి కోర్టుని ఆశ్రయించాడు.
ఈ దాడి వల్ల అతను ఫిజికల్ గా అలాగే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని అంతేకాకుండా చాలా నష్టపోయానని.. ఫిర్యాదులో పేర్కొన్నాడు గాంధీ. అందుకే విజయ్ సేతుపతి మరియు అతని సిబ్బంది తనకి రూ.3 కోట్లు భారీ మూల్యం చెల్లించాలని కూడా మహా గాంధీ పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక విజయ్ సేతుపతి అండ్ టీం ఈ విషయం పై లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకున్నారట. మరి ఇందులో నిజానిజాలు ఏంటో కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాలి.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!