Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళ దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు  (R. Ajay Gnanamuthu) సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘ డిమోంటి కాలనీ’ (Demonte Colony) ‘అంజలి సీబీఐ’ (Anjali CBI) వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ‘డిమోంటి కాలనీ’ చిత్రాన్ని టీవిలో ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘డిమాంటి కాలనీ 2’ ని తీసుకొచ్చాడు అజయ్. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ విడుదల చేసింది.

Demonte Colony 2 Collections

ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.4 వ రోజు కూడా కృష్ణాష్టమి సెలవు కలిసొచ్చి బాగానే క్యాష్ చేసుకుంది.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.63 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర(టోటల్ ) 0.42 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 1.30 cr

‘డిమోంటి కాలనీ 2’ చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.1.3 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.0.50 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే వీక్ డేస్ లో బాగా కలెక్ట్ చేస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus