Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళంలో రూపొందిన హర్రర్ సినిమాల్లో బాగా భయపెట్టిన సినిమాగా ‘ డిమోంటి కాలనీ’ (Demonte Colony)   నిలిచింది. దానికి సీక్వెల్ గా ‘డిమోంటి కాలనీ 2’ రూపొందింది. ఆర్.అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 23న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. వీక్ డేస్ లో అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా స్లో అయిపోయింది.

Demonte Colony 2 Collections

ఒకసారి (Demonte Colony 2) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.83 cr
సీడెడ్ 0.32 cr
ఆంధ్ర(టోటల్ ) 0.56 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 1.71 cr

‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో రూ.1.71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కి రూ.0.09 దూరంలో ఆగిపోయి.. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓటీటీలో ఈ చిత్రాన్ని బాగానే వీక్షించారు. జీ5 లో ఈ సినిమాకి ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదైనట్టు సమాచారం. తెలుగు డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతగా బాగానే లాభాలు వచ్చాయి. తమిళంలో కూడా ఈ సినిమా బాగానే ఆడింది.

స్పిరిట్‌ సౌండ్ మొదలైంది.. సందీప్ వంగా క్రేజీ అప్డేట్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus