Demonte Colony 2 Collections: ‘డిమోంటి కాలనీ 2’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?
- August 30, 2024 / 01:57 PM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘డిమోంటి కాలనీ’ (Demonte Colony) ‘అంజలి సీబీఐ’ (Anjali CBI) వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ‘డిమోంటి కాలనీ’ చిత్రాన్ని టీవిలో ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘డిమాంటి కాలనీ 2’ ని తీసుకొచ్చాడు అజయ్. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ విడుదల చేసింది. ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం..
Demonte Colony 2 Collections

ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.మొదటి 4 రోజులు బాగా కలెక్ట్ చేసిన ఈ సినిమా 5వ రోజు నుండి కొంచెం డౌన్ అయ్యింది. ఒకసారి (Demonte Colony 2 Collections) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.75 cr |
| సీడెడ్ | 0.30 cr |
| ఆంధ్ర(టోటల్ ) | 0.50 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 1.55 cr |
‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2 Collections) చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ చిత్రం రూ.1.55 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.0.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈ వీకెండ్ కి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.











