ఇల్లు కొనుక్కున్న రకుల్..!

హీరోయిన్ స్టార్ డం ఎప్పుడొస్తుందో తెలీదు.. అలాగే ఎంత కాలం ఉంటుందో కూడా తెలీదు. అందుకే క్రేజ్ ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ సంపాదించుకోవడానికి చూస్తుంటారు. ‘దీపం ఉండడగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నట్టు అన్న మాట. ఈ బాటలోనే హీరోయిన్ రకుల్ కూడా ముందుకు సాగుతుంది. రెండేళ్ళ క్రితం వరకూ ఈ బ్యూటీకి మంచి స్టార్ డం. వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. పారితోషికాన్ని బేస్ చేసుకుని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోతో కూడా నటించింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కుందట. దీంతో ఈమె ఆస్తులు ఎంత ఉండొచ్చు అనే విషయం పై డిస్కషన్లు జరుగుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కు ‘ఎఫ్45’ అనే ‘జిమ్’ బిజినెస్ ఉంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ‘ఎఫ్45’ బ్రాంచ్ లు ఉన్నాయి. బెంగుళూరులో కూడా ఈమెకు ఖరీదైన ఫ్లాట్ ఉందట. దీని విలువ 6 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. బెంగుళూర్ లో కూడా ‘ఎఫ్45’ కు సంబందించిన బ్రాంచీలు ఓపెన్ చేసే ప్లానింగ్ లో కూడా రకుల్ ఉందట. ఇక సినిమాల విషయంలో బాలీవుడ్ తో పాటు తెలుగులో నితిన్ తో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఏమైనా ఈమె ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus