దర్శకుడు దేవ కట్టా కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చేసింది. ఇకపై అలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటానని అంటున్నారు ఈ డైరెక్టర్. ముఖ్యంగా ఈసారి ఆరేడు కథలు రెడీ చేసుకున్నానని.. వాటిలో రెండు, మూడు కథలు అద్భుతంగా వచ్చాయని అంటున్నాడు. తను చచ్చిపోయేలోపు ఆ కథలను ప్రేక్షకులకు కచ్చితంగా చూపిస్తానని అంటున్నాడు. 6-7 కథలతో రెడీగా ఉన్నానని.. అన్నీ కొత్త పాయింట్లే అని.. ‘రిపబ్లిక్’ సినిమా రిలీజైన మూడు నెలలకే మరో సినిమా మొదలుపెట్టేంత రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
‘రిపబ్లిక్’ తరువాత నాలుగైదేళ్లు సినిమాలే చేస్తానని.. తన దగ్గర రెండు, మూడు బలమైన కథలు ఉన్నాయని.. అవి జనాలకు చెప్పకుండా చచ్చిపోయానంటే.. తన జన్మకు అర్ధం ఉండదని అన్నారు. కాబట్టి ఆ కథలను ముందుగా సినిమాలుగా తీస్తానని చెప్పుకొచ్చారు. ‘రిపబ్లిక్’ సినిమా తరువాత పొలిటికల్ కథలకు కొన్నాళ్లపాటు విరామం ఇస్తానని చెబుతున్నాడు ఈ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీ ఒకటి ఉందని.. దీంతో పాటు మరో స్టోరీ కూడా ఒకటి ఉందని చెప్పారు.
17 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో మొదలుపెట్టి.. 45 ఏళ్ల తల్లిగా ఆమె మారిన జర్నీతో ఓ కథ ఉందని అన్నారు. దుబాయ్ కేంద్రగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో కూడా ఓ కథ ఉందని.. ఇలా కొత్త జానర్లు టచ్ చేయబోతున్నట్లు చెప్పారు.