భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈసారి నాగార్జున, నానిలతో మల్టీస్టారర్ మూవీ చేశారు. ఇది వచ్చే వారం థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి ఇది హాలీవుడ్ మూవీ ‘అనాలసిస్ దిస్’ అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారని నెటిజనులు కామెంట్స్ చేశారు. అలాగే దీనిపై వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు శ్రీరామ్ స్పందిస్తూ ఈ చిత్రం రీమేక్ కానే కాదని, ఒరిజినల్ స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా వివరం ఇచ్చారు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం పక్కాగా 1999లో వచ్చిన “అనాలసిస్ దిస్” అనే హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ నెటిజనులు చెబుతున్నారు.
అనాలసిస్ దిస్ చిత్రంలోని రాబర్డ్ డెనిరో పోషించిన పాత్ర బాడీలాంగ్వేజ్, దేవదాస్ చిత్రంలోని నాగార్జున బాడీలాంగ్వేజ్ ల మధ్య చాలా పోలికలు ఉన్నాయని, రెండు పాత్రలు కూడా సేమ్ టు సేమ్ అని భావిస్తున్నారు. నాని పాత్ర బిల్లీ క్రిస్టల్ పాత్రను పోలి ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుకే కచ్చితంగా ‘అనాలసిస్ దిస్’ అనే చిత్రంకు అనధికారిక రీమేక్ అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో రెండు వీడియోలను పక్క పక్కన పోస్ట్ చేసి దీనికి నీ సమాధానం ఏంటీ శ్రీరామ్? అంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు. మరి ఇందుకు శ్రీరామ్ ఏవిధంగా సమాధానం ఇస్తారో చూడాలి.