ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ (Devara) స్టడీ రన్ కంటిన్యూ అవుతుంది.సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమాకి వీకెండ్ తో పాటు, గాంధీ జయంతి హాలిడే,దసరా హాలిడేస్ బాగా కలిసొచ్చాయి. దావూది సాంగ్ యాడ్ అవ్వడం కూడా ప్లస్ అయ్యింది అని చెప్పాలి.దసరాకి విడుదలైన సినిమాలు కూడా ‘దేవర’ కలెక్షన్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. నార్త్, ఓవర్సీస్ లో కూడా ‘దేవర’ బాగా కలెక్ట్ చేసింది.
ఒకసారి (Devara) 20 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 56.95 cr |
సీడెడ్ | 29.28 cr |
ఉత్తరాంధ్ర | 16.66 cr |
ఈస్ట్ | 9.56 cr |
వెస్ట్ | 7.44 cr |
గుంటూరు | 11.87 cr |
కృష్ణా | 8.47 cr |
నెల్లూరు | 5.63 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 145.86 cr |
కర్ణాటక | 15.19 cr |
తమిళనాడు | 2.48 cr |
కేరళ | 0.76 cr |
నార్త్ | 27.50 cr |
ఓవర్సీస్ | 34.93 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 226.72 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 20 రోజులు పూర్తయ్యేసరికి రూ.226.72 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.51.72 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.