Rakul Preet Singh: గాయపడిన స్టార్‌ హీరోయిన్‌… వైద్యులు ఏం చెప్పారంటే?

ప్రముఖ కథానాయిక.. టాలీవుడ్‌ వదిలేసి బాలీవుడ్‌కు అర్ధాంతరంగా వెళ్లిపోయిన నాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh )ఇటీవల గాయపడింది. ఈ మేరకు కొంత సమాచారం కాస్త ఆలస్యంగా మన వరకు వచ్చింది. జిమ్‌లో వర్కవుట్స్ చేసే రకుల్ వెన్నెముకకు గాయమైందట. దీంతో ఆమె ఇప్పుడు రెస్ట్‌లో ఉన్నారు అని సమాచారం. 80 కిలోల బరువును ఎత్తే చేసే క్రమంలో ఆమె గాయపడిన సమాచారం. వర్కవుట్ చేసే సమయంలో బెల్ట్ పెట్టుకోకుండా భారీ వెయిట్ ఎత్తడంతోనే ఇలా జరిగిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Rakul Preet Singh

అయితే ఈ విషయంలో ఆమె నుండి కానీ, ఆమె టీమ్‌ నుండి కానీ క్లారిటీ రావాల్సి ఉంది. ఆమెను ఇటీవల వైద్యులు పరిశీలించి, కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారట. ఇప్పుడు అందుకే ఆమె బయట పెద్దగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇటీవల అంటే ఒకట్రెండు రోజులు కాదని.. ఆమెకు గాయమై రెండు వారాలకుపైనే అయిందని చెబుతున్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో కోరుతున్నారు.

ఇక రకుల్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఫోకస్ బాలీవుడ్‌పైనే పెట్టింది. అక్కడ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో ‘దే దే ప్యార్ దే’ సినిమా సీక్వెల్‌లో నటిస్తోంది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘దే దే ప్యార్‌ దే’ సినిమాలో రకుల్‌ కాస్త బో*ల్డ్‌గా కనిపించింది.

మరిప్పుడు పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి. ఇది కాకుండా ‘ఇండియన్‌ 3’ సినిమాలోనూ ఆమె నటించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందా? లేక ఓటీటీలోకి నేరుగా వస్తుందా అనేది తెలియడం లేదు. కొంతమంది అయితే ఈ ప్రాజెక్టును పక్కన పడేసినట్లే అని చెబుతున్నారు కూడా.

హాస్ ని డిజప్పాయింట్ చేసిన ‘జనక..’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus