వంద రోజుల సినిమాకి కాలం చెల్లిపోయింది అని అంతా అనుకుంటున్న తరుణం ఇది. ఎందుకంటే ఇప్పట్లో ఎంత పెద్ద సినిమా అయినా 4 వారాల రన్ ఉంటే గ్రేట్. ఆ టైంలో ఎంత కలెక్ట్ చేసుకుంటే అంత వస్తుంది. బ్లాక్ బస్టర్స్ లో దాని రేంజ్ ఏంటి? అనేది ట్రేడ్ పండితులు చెబుతారు. 2024 లో విడుదలైన సినిమాల్లో ‘హనుమాన్’ (Hanuman) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) వంటి సినిమాలు కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడాయి.
‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) తాజాగా వాటి లిస్టులో ‘దేవర’ (Devara) కూడా చేరింది. అవును సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) రిలీజ్ అయ్యింది. సినిమాకి మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా సరే.. ఎన్టీఆర్ (Jr NTR) స్టార్ డం, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో అతనికి ఉన్న క్రేజ్ .. ‘దేవర’ ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి.నవంబర్ 8న అంటే 6 వారాలకే ‘దేవర’ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చినా 52 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంది.
ఇక నేడు అంటే జనవరి 4 తో ‘దేవర’ వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. 6 కేంద్రాల్లో ‘దేవర’ శతదినోత్సవం జరుపుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ‘దేవర’ చిత్రానికి రెండో భాగం కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ చాలా ప్రశ్నలు వదిలేశాడు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). దీంతో దేవర రెండో భాగంపై అందరికీ ఆసక్తి పెరిగింది.