Devara: ఎన్టీఆర్, కొరటాల.. ప్రమోషన్స్ కలిసొచ్చాయా..?

ఎన్టీఆర్  (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  కలయికలో ‘దేవర'(మొదటి భాగం)  (Devara)  వచ్చింది. ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన సినిమా కావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఎన్టీఆర్, కొరటాల శివ..లకి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా.. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. తర్వాత దసరా సెలవులు వంటివి కలిసొచ్చి.. బాగా క్యాష్ చేసుకుంది.

Devara

మొత్తంగా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది ‘దేవర’ సినిమా. అలా ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా 7 హిట్లు పడేలా చేసింది. ఇక ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పట్లో సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఎన్టీఆర్ ‘వార్ 2’ (War 2) ఫినిష్ చేయాలి.

తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాకి కూడా డేట్స్ ఇవ్వాలి. ఇదిలా ఉంటే.. ‘దేవర’ సినిమాని ఇటీవల జపాన్లో రిలీజ్ చేశారు. అక్కడ ఎన్టీఆర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమా కూడా జపాన్లో భారీ వసూళ్లు సాధించింది. ఇక ‘దేవర’ సినిమాకి ఇప్పటివరకు అక్కడ 10 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తుంది.

దీంతో 15.5 మిలియన్ యెన్స్(జపాన్ కరెన్సీ) ను కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.90 లక్షల వరకు గ్రాస్ ఉంటుంది అని అంచనా. వీక్ డేస్లో కూడా అక్కడ స్టడీగా కలెక్ట్ చేస్తున్నట్టు టాక్. అయితే జపాన్ ప్రమోషన్స్ కోసమే టీం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వినికిడి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus