Devara: బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన కొరటాల.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘దేవర’ అనే మరో సినిమా కూడా రూపొందుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కావడంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చూపు కూడా ఈ ప్రాజెక్టు పై పడింది. అందులోనూ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు.

‘యువసుదా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్ కి రిలీజ్ అయ్యేది ‘దేవర పార్ట్ 1 ‘ అట. అవును ఈ చిత్రానికి రెండో భాగం కూడా ఉందని.. స్వయంగా దర్శకుడు కొరటాల శివ చెప్పి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

కొరటాల శివ మాట్లాడుతూ.. “ ‘దేవర’ అనేది ఓ పెద్ద సినిమా.. ఒక బిగ్ కాన్వాస్ లా ఉంటుంది. అంతేకాకుండా ఎంతోమంది స్టార్ క్యాస్టింగ్.. ఎంతో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా మొదలుపెట్టాం..! ముందుకు వెళ్లేకొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. అయితే ఆ తర్వాత మాకు, ఎడిటర్ కు ఓ డౌట్ వచ్చింది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.. ఒక్క సీన్ ను కూడా కట్ చేయలేము..

లెంగ్త్ సమస్య కారణంగా ఒక్క డైలాగ్ కూడా తీయలేము అని ఫీల్ అయ్యి.. ఆదరాబాదరాగా అన్ని క్యారెక్టర్స్ ను ఒక పార్ట్ లో నే కుదించేయలేం.. ఇంత పెద్ద సినిమాను రెండు భాగాలుగా తీస్తే.. అందరి క్యారెక్టర్స్ ను చాలా డెప్త్ గా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నాం. దేవర రెండు భాగాలుగా వస్తుంది. దేవర మొదటి భాగం 2024 ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus