Devara: బాహుబలి ఫార్ములాను ఫాలో అవుతున్న కొరటాల.. వర్కౌట్ అవుతుందా?

బాహుబలి (Baahubali), బాహుబలి2 (Baahubali 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. బాహుబలి, బాహుబలి2 సినిమాలు సక్సెస్ కావడానికి ఆ సినిమాలలోని ట్విస్టులు, అద్భుతమైన కథ, కథనం కారణమయ్యాయి. తండ్రీకొడుకుల పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన (Prabhas) ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు (Koratala Siva) కొరటాల శివ సైతం దేవర (Devara) విషయంలో బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

దేవరలో ఫస్ట్ పార్ట్ లో కొడుకు పాత్రకు సంబంధించిన సీన్లు ఉంటాయని తండ్రి పాత్ర ఎంట్రీతో సినిమా ముగుస్తుందని తెలుస్తోంది. అయితే తండ్రి పాత్రలో ఎన్టీఆర్ కూడా యంగ్ ఏజ్ లో కనిపిస్తారని బాహుబలిలో మహేంద్ర, అమరేంద్ర పాత్రలను చూపించిన విధంగానే దేవరలో పాత్రలను చూపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ లో దేవర షూట్ జరుగుతోందని తెలుస్తోంది. వీలైనంత వేగంగా ఈ సినిమా షూట్ ను పూర్తి చేసి వార్2 సినిమాతో (Jr NTR) తారక్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

వార్2 సినిమాలో తారక్ ఏజెంట్ గా కనిపిస్తున్నా ఆ పాత్రకు సంబంధించి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. అనిరుధ్ దేవర మిగతా పాటలను సైతం త్వరలో షూట్ పూర్తి చేయనున్నారని భోగట్టా. దేవర1 సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కొరటాల శివ కథ, కథనంతో మ్యాజిక్ చేయడంతో పాటు ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీ పూర్తైన తర్వాతే దేవర2 మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర2 సినిమా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది. తారక్ ఈ సినిమాకు పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus