బిగ్‌బాస్‌: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది ఆమెనే!

‘ఈసారి బిగ్‌బాస్‌ విన్నర్‌ అమ్మాయే అవ్వాలి’ అంటూ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టింది దేవీ నాగవల్లి. బయట ‘దేవీ అంత ఈజీ కాదు’ అని అందరూ అంటుంటారు. ఇంట్లో కూడా అందరూ అదే మాట అన్నారు. వెళ్లిపోతూ వెళ్లిపోతూ కళ్యాణి కూడా అదే మాట చెప్పింది. అంతేకాదు నామినేట్‌ కూడా చేసింది. అయితే ప్రేక్షకుల మాట మరోలా ఉంది. ఇంట్లో ఆమె ఉండక్కర్లేదు అంటూ తక్కువ ఓట్లు వేశారు. దీంతో లేడీ బిగ్ బాస్ అనిపించుకోవాలనే ఆమె కల… చెదిరిపోయింది.

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో మూడో ఎలిమినేషన్‌గా దేవీ నాగవల్లిని బయటకు పంపించారు. మొత్తం పోలైన ఓట్లలో తక్కువ ఓట్లు రావడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నాం అంటూ నాగార్జున చెప్పారు. దీని కోసం కలర్‌ బాక్స్‌ స్టయిల్‌ వాడారు. ఆఖరిగా ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న కుమార్‌ సాయి, దేవీ నాగవల్లికి రెండు బాక్సులు ఇచ్చారు. అందులో ఒక బాక్సులో ఎరుపు రంగు, ఇంకో బాక్సులో ఆకుపచ్చ రంగు వేశారు. ఎరుపు రంగు వచ్చినవారు ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున చెప్పారు. అలా దేవీ ఎలిమినేట్‌ అయిపోయింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న దేవీ ఎలిమినేట్‌ అవ్వడం కొందరికి షాక్‌కు గురి చేయగా, ఇంకొందరు మాత్రం అందరితో అంటీముట్టనట్లు ఉంటుంది కాబట్టే బయటకు వెళ్లిపోయింది అని కూడా అనుకుంటున్నారు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus