Devi Puthrudu: ‘దేవీపుత్రుడు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతందంగా ఉందో చూడండి..!

విక్టరీ వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘దేవీపుత్రుడు’ అనే సినిమా వచ్చింది.2001లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యం.యస్.రాజు నిర్మాత. అంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘శత్రువు’ అనే బ్లాక్ బస్టర్ మూవీ కూడా వచ్చింది. దీంతో ‘దేవీపుత్రుడు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో ఈమె విఫలమైంది. అయితే ఇప్పుడు టీవీల్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఇది బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో (Devi Puthrudu) వెంకటేష్, సౌందర్య..ల కూతురిగా ఓ పాప కనిపిస్తుంది. ఆమెని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ‘దేవిపుత్రుడు’ లో వెంకటేష్ కూతురిగా నటించిన అమ్మాయి పేరు వేగా తమోతియా. ఆ సినిమాలో ‘ఆకాశంలోని చందమామ’ అలాగే కృష్ణుడి పాటలో ఈమె హావ భావాలు చాలా క్యూట్ గా అనిపిస్తాయి. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈమె కనిపించింది లేదు. తాజాగా ఈమె నెటిజన్ల తవ్వకాల్లో బయటపడింది.

అవును ఆ పాప ఇప్పుడు చాలా అందంగా మారింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు కానీ.. వేగా తమోటియా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగులో ‘దేవీపుత్రుడు’ తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈమె నటించింది. అలాగే కొన్ని షోలకు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus