Dhamaka,18 Pages: ఈ శుక్రవారం విజేతగా నిలిచేది ఆ మూవీనేనా?

ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న ధమాకా, 18 పేజెస్ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం థియేటర్లలో అవతార్2 మినహా మరే భారీ సినిమా లేకపోవడంతో ఈ రెండు సినిమాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దక్కాయి. కార్తికేయ2 సక్సెస్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడం ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండటం 18 పేజెస్ సినిమాకు ప్లస్ అయింది. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.

పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. కార్తికేయ2 జోడీ అయిన నిఖిల్, అనుపమ ఈ సినిమాలో నటించడం గమనార్హం. 18 పేజెస్ మూవీ కూడా సక్సెస్ సాధిస్తే ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కి థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిఖిల్ అనుపమ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న ఈ జోడీ మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన ధమాకా మూవీ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డైలాగ్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం.

రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మాస్ మహారాజ్ ఆశలను నెరవేరుస్తుందో లేక రవితేజను నిరాశకు గురి చేస్తుందో చూడాల్సి ఉంది. ఒకేరోజు ఈ రెండు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో మాస్ ప్రేక్షకులు ధమాకాపై, క్లాస్ ప్రేక్షకులు 18 పేజెస్ మూవీపై దృష్టి పెడుతున్నారు. సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు థియేటర్లలో ఈ రెండు సినిమాల హవా కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus