Dhanraj: ప్రభాస్ మూవీ వల్ల ధనరాజ్ కు అంత నష్టమా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో ధనరాజ్ (Dhanraj) ఒకరు కాగా ఈ స్టార్ కమెడియన్ ప్రభాస్ (Prabhas)  నటించిన బాహుబలి (Baahubali 2)  సినిమా వల్ల భారీ నష్టం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనరాజ్ నిర్మాతగా 2015 సంవత్సరంలో ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించడం జరిగింది. ఈ సినిమా బాగానే ఉన్నా ఈ సినిమా విడుదలైన కొన్నిరోజుల తర్వాత బాహుబలి సినిమా విడుదల కావడంతో తాను కెరీర్ పరంగా నష్టపోవడం జరిగిందని ధనరాజ్ చెప్పుకొచ్చారు.

ధనలక్ష్మి తలుపు తడితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని అయితే సినిమా రిలీజ్ సమయంలో వరుణ్ తేజ్ (Varun Tej)  హీరోగా తెరకెక్కిన లోఫర్ మూవీ (Loafer) కోసం నేను రాజస్థాన్ కు వెళ్లానని ధనరాజ్ కామెంట్లు చేశారు. నా సినిమా రిలీజ్ సమయంలో మూవీకి టికెట్లు దొరకడం లేదని శ్రీముఖి (Sreemukhi) చెప్పడంతో చాలా సంతోషించానని అయితే తర్వాత వారం బాహుబలి రిలీజ్ కావడంతో నా సినిమా ఆడుతున్న థియేటర్లు అన్నీ అగ్రిమెంట్ ప్రకారం ఆ సినిమా కోసం కేటాయించడం జరిగిందని ధనరాజ్ పేర్కొన్నారు.

ఆ డబ్బులను ల్యాండ్ పై పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ల్యాండ్ విలువ కోట్ల రూపాయలుగా ఉండేదని ధనరాజ్ అన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ధనరాజ్ చేసిన కామెంట్ల విషయంలో అతనినే నిందిస్తున్నారు. బాహుబలి సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి ఆ సమయంలో పెద్ద సినిమాలే రిలీజ్ డేట్లను మార్చుకున్నాయని నీ సినిమాను ఎందుకు రిలీజ్ చేశావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సినిమా రంగంలో జయాపజయాలు సాధారణం అని వాటికి ఎవరూ అతీతం కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనరాజ్ ప్రస్తుతం రామం రాఘవం (Ramam Raghavam) అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus