Dhanush, Sekhar Kammula: మారిపోయిన శేఖర్ కమ్ముల.. అలాంటి కథతో సినిమానా?

ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని చాలారోజుల క్రితం ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ధనుష్ మాస్ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకుంటే శేఖర్ కమ్ముల క్లాస్ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో మూవీ స్కామ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాల సక్సెస్ నేపథ్యంలో శేఖర్ కమ్ముల కథల విషయంలో పూర్తిగా మారిపోయారు.

లవ్ స్టోరీ సినిమాలో సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేసి ప్రశంసలు అందుకున్న శేఖర్ కమ్ముల ధనుష్ కు సూట్ అయ్యే కథను ఎంచుకోవడంతో ఈ సినిమాతో సక్సెస్ గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ధనుష్ రోల్ తో పాటు ఈ సినిమాలో మరో ముఖ్యమైన రోల్ ఉంటుందని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని బోగట్టా. శేఖర్ కమ్ముల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని బోగట్టా. పది కోట్ల రూపాయల రేంజ్ లో శేఖర్ కమ్ముల పారితోషికాన్ని తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ధనుష్ ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.a

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus