లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ధనుష్… శేఖర్ కమ్ముల సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే వరుస తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ ఆ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా వచ్చేయడానికి ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. నిజానికి ఈ సినిమానే ముందుగా ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల శేఖర్ కమ్ముల సినిమా ఆలస్యం అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి ఇదివరకే నటించిన ఫిదా,

లవ్ స్టోరీస్ సినిమాలు ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ సినిమా కోసం శేఖర్ కమ్ముల సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus