Dhanush, Aishwarya: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య!

తమిళ హీరో ధనుష్ తన భార్య, సినీ నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. ధనుష్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేయడం ద్వారా ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ధనుష్.. అభిమానులను అలాగే మీడియా నుండి ప్రైవసీ కోరాడు. వారి నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.

ధనుష్ తన సోషల్ మీడియాలో ఇలా వివరణ ఇచ్చారు.. “18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉన్నాము. ఈ ప్రయాణంలో మా ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు అనుకూలతను ఎన్నో చూశాము. ఈ రోజు మా దారులు విడిపోయే ప్రదేశంలో ఉన్నాయి. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మంచి కోసం వ్యక్తిగతంగా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాము.. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి, దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రైవసీ మాకు అందించండి.

ఓం నమశివాయ!”.. అంటూ ధనుష్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అని అందరికి తెలిసిందే. ఆమె చిత్రనిర్మాతగా గాయని కూడా.. ఇక ధనుష్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు.ధనుష్ మరియు ఐశ్వర్య 18 నవంబర్, 2004న ఆరు నెలలకు పైగా పరిచయమైన తర్వాత వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ జంట చాలా చిన్న వయస్సులో ఉన్నారు. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు.

ఈ దంపతులకు యాత్రా, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల సార్ సినిమా ప్రారంభోత్సవానికి ధనుష్‌తో పాటు ఐశ్వర్య కూడా ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నారు. ధనుష్ ఐశ్వర్యల విడాకుల వార్తలు చాలా మందికి, ముఖ్యంగా అభిమానులకు షాక్‌కి గురిచేశాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇంకా ఈ వార్తపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus