సహజంగా సినిమా అంటేనే ఒక కల్పన. అయితే తెరపై హీరోలు చేసే ప్రతీ పని పాత్రలో భాగమే కానీ, అది వారి అసలు స్వరూపం కాదు. అయితే ప్రస్తుతం ఉన్న యువత హీరోలను ఆదర్శమగా తీసుకుంటూ కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. విషయం ఏమిటంటే….సినిమాలు నేటి తరాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అంటే….ఒక హత్య చేసే అంతవరకూ పోయింది ఈ పిచ్చి పైశాచిక అభిమాన ఆనందం….వివరాల్లోకి వెళితే…తాజాగా చెన్నై లో ఒక టెక్క్కి మర్డర్ జరిగింది. అయితే దాన్ని చేదించిన పోలీసులకు కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
ఈ మర్డర్ కు కారణం ప్రముఖ తమిళ నటుడు తలైవార్ అల్లుడు “ధనుష్” అని తెలిపాడు మర్డర్ చేసిన వ్యక్తి….అసలు ఈ ట్విష్ట్ ఏంటి అనుకుంటున్నారా….కంగారు పడాల్సింది ఏమీ లేదు….ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది….తమిళ నాడులో రామ్ కుమార్ అనే వ్యక్తి హీరో ధనుష్ కు పెద్ద ఫ్యాన్… అతనే ఈ మర్డర్ చేసిన దుర్మార్గ్గుడు. ఒక అబ్బాయి ప్రేమించి ప్రేమని పొందని సమయాల్లో ఎలా ఫీల్ అవుతాడు అనేది వర్ణిస్తూ ధనుష్ ది కొలవరి సాంగ్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో నల్లగా ఉండే అబ్బాయి తెల్లగా ఉండే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఆమె దాన్నితిరస్కరిస్తే ఎలా ఉంటుందో అనే సన్నివేశం లో ఈ పాట వస్తుంది.
అయితే ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరో పక్క ధనుష్ ను ఫాలో అయ్యే రామ్ కుమార్ ఆమె ప్రేమని నిరాకరించడం ఆమె చేసిన పాపం అనీ తన పెర్సనాలిటీ చూసి ఆమె ఏడిపించింది అనీ అందుకే చంపేసాను అని మీడియాకు తెలిపాడు. ఇలా హీరోలను చూసి తామేదో పెద్ద హీరోలుగా ఫీల్ అయిపోతూ యువత పెడదారి పట్టడం నిజంగా భాదాకర విషయం అనే చెప్పాలి.